Saturday, January 18, 2025

కాళేశ్వరాన్ని తలదన్నే భూకుంభకోణం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ హయాంలో రూ.1.50 లక్షల
కోట్ల విలువైన భూములు మాయం
పార్ట్ బి కింద చూపి ప్రైవేట్ వ్యక్తులకు
రిజిస్ట్రేషన్ బిఆర్‌ఎస్ భూముల
లూటీపై ఫోరెన్సిక్ ఆడిట్
మీడియాతో చిట్‌చాట్‌లో డిప్యూటీ
సిఎం భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్ర భుత్వ హయాంలో జరిగిన భూ దందాలతో పోలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీ తి నథింగ్ అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రాథమిక అంచనా ప్రకా రం వారి హయాంలో రూ. 1.50 లక్షల కోట్ల విలువ చేసే భూములు చేతు లు మారాయని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మంత్రి భట్టి విక్రమార్క మీడియాతో చిట్ చాట్ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూము ల లూటీపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసి బయట పెట్టబోతున్నామని చెప్పారు.

వేలాది ఎకరాల ప్ర భు త్వ భూములను పార్ట్ బీ కింద చూపెట్టి ప్రై వే ట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుం భకోణం ఇదేనని పేర్కొన్నారు. విదేశాల నుం చి వచ్చి భూములు తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చే యించుకొని ఆ తర్వాత తిరిగిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయన్నారు.ధరణిని అడ్డం పెట్టుకొని కాజేసిన భూదందాలలో ఇప్పటికే ముగ్గురు, నలుగురు యజమానుల పేర్ల పై బదలాయింపు జరిగిందన్నారు. తమ ప్రభు త్వం ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వీటన్నింటిని బయటికి లాగబోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News