Monday, December 23, 2024

రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనానికి స్థలం కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భవనానికి స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి నిధులు స మకూర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి దామోదర్‌రెడ్డి, సి చంద్రశేఖర్, కోశాధికారి ఎ గంగారెడ్డి లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బడీచౌడీలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడు తూ తమ సంఘంలో అన్ని ప్ర భుత్వ శాఖలకు చెందిన వేలాది మంది అటెండర్ స్థాయి ఉద్యోగి నుండి గ్రూప్= 1 స్థాయి అధికారి వరకు రిటైర్డ్ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

పెన్షనర్లను తీవ్రంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నివారణ మూల్య పె న్షన్ నుండి 1 శాతం మినహా యించి, పూర్తి స్థాయిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్( ఈహెచ్‌ఎస్ ) వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రెండవ పే రివిజన్ కమిటీని నియమించి, జులై 1నుండి అమలు చేయాలని, అంతలోగా ఐ ఆర్ ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఆర్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

పెన్ష నర్ల కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు తగ్గించాలని,డెత్ రిలీఫ్ ఫండ్, మెడికల్ రీయంబర్స్ బిల్లులు, 2018 తర్వాత పదవీ విరమణ పొందిన పెన్షనర్ల వివిధ రకాల పెన్షనరీ స దుపాయాల బిల్లును వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు . నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలపై 262 మం డల శాఖల కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ల ద్వారా 33 జిల్లా శాఖలు, రాష్ట్రంలోని కలెక్టర్ల ద్వారా ఇప్పటికే సిఎం కెసిఆర్‌కు, వినతి పత్రాలు, స్పీడ్ పోస్టులు పంపించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News