Sunday, December 22, 2024

అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యజమాని

- Advertisement -
- Advertisement -

అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లోని హసన్ నగర్ లో ఇంటి యజమాని దాష్టీకానికి పాల్పడ్డాడు. ఇంటి అధ్దె కట్టలేదని యువతిపై యజమాని కత్తితో దాడి చేశాడు. చేతికి, తలకు కత్తి పోట్లు పడడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఇంటి అద్దె చెల్లించకుండా అద్దెకు ఓ‌ కుటుంబం ఉంటుంది. ఇంటి అద్దె చెల్లించాలని పలుమార్లు వారిని ఇంటి యజమాని కోరారు. అద్దె చెల్లించకపోవడంతో పాటు యజమానితో కిరాయిదారులు దురుసుగా ప్రవర్తించారు.

దీంతో యజమాని వారు ఉంటున్న రూమ్ కు కరెంట్ కట్ చేయడంతో ఘర్షణ నెలకొంది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో యజమానిపై కిరాయిదారుల కుటుంబం దాడికి యత్నించారు. ఆగ్రహంతో రగిలిపోయిన యజమాని కత్తి తీసుకొని యువతిపై విచాక్షణ రహితంగా దాడి చేశారు. యువతి కత్తి పోట్లకు గురికావడంతో వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News