Monday, January 20, 2025

ఇంటర్‌లో తక్కువ మార్కులు..ఇల్లు అద్దెకు ఇవ్వనన్న ఓనర్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: మార్కులు బాగాలేకపోతే ఉద్యోగానికి ఎంపిక కాకపోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే 12వ తరగతి మార్కులు తక్కువగా వచ్చినందుకు ఇల్లు అద్దెకు ఇవ్వనంటూ ఒక ఇంటి యజమాని తిరస్కరించిన సంఘటన ఎక్కడైనా విన్నారా? బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమాని కొన్ని కండీషన్లు పెడుతుంటారు. శాకాహారులకే ఇస్తామంటారు కొందరు..బహ్మచారులకు ఇవ్వమంటారు కొందరు. గుర్తింపు ఆధారాలు సమర్పిస్తే చాలు ఇల్లు అద్దెకు ఇచ్చే ఓనర్లు చాలామంది ఉంటారు. అలాంటిది అద్దె ఇంటి కోసం వచ్చిన వ్యక్తి మార్కుల షీట్ చూసి తక్కువ మార్కులు వచ్చినందుకు ఇల్లు అద్దెకు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఒక ఇంటి ఓనర్ తెగేసి చెప్పాడు.ఈ విచిత్ర సంఘటన గురించి శుభ్ అనే ట్విట్టర్ యూజర్ వెల్లడించగా నెటిజన్లు షాకయ్యారు. యోగేష్ అనే వ్యక్తికి, బ్రిజేష్ అనే బ్రోకర్‌కు మధ్య సాగిన సంభాషణల స్క్రీన్‌షాట్స్‌ను శుభ్ షేర్ చేశాడు.

Also Read:ఎటిఎం చోరీలో క్రాష్ కోర్సు: నిరుద్యోగులే టార్గెట్ !

అద్దెకు ఫ్లాట్ ఉందని తెలిసి యోగేష్ ఆన్‌లైన్‌లో బ్రోకర్ బ్రిజేష్‌ను సంప్రదించాడు. అగ్రిమెంట్ ఖరారు చేసేందుకు ప్రొఫైల్‌తోపాటు 10వ తరగతి, 12వ తరగతి మార్కు లిస్టులు, గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో పంపాలని బ్రిజేష్ చెప్పాడు. ఈ డిమాండ్లకు అంగీకరించి యోగేష్ అన్ని పత్రాలతో పాటు తన గురించి 150-200 పదాలతో ఒక వ్యాసం రాసి పిడిఎఫ్ పంపించాడు.
అయితే బ్రిజేష్ నుంచి వచ్చిన సమాధానం చూసి యోగేష్ షాకయ్యాడు. 12వ తరగతిలో 75 శాతం మార్కులే వచ్చినందుకు ఇంటి యజమాని మీకు ఫ్లాట్ అద్దెకు ఇవ్వడానికి నిరాకరించాడని బ్రిజేష్ చెప్పాడు. కనీసం 90 శాతం మార్కులన్నా రావాలని ఓనర్ ఆశిస్తున్నట్లు అతను చెప్పాడు.ఇందుకు సంబంధించిన చాట్‌లను స్క్రీన్‌షాట్లు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేయగా 13 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. ఇంటి యజమాని పెట్టిన కండీషన్ విని పలువురు నెటిజన్లు విస్తుపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News