Sunday, December 22, 2024

రీసర్వే పేరుతో భూములను కబ్జా చేశారు: ప్రత్తిపాటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వంలో భూముల రీసర్వే, చట్టంలో లొసుగులతో భూములను వైసిపి నేతలు కాజేశారని టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సిపి నేతల భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బినామీలను అడ్డం పెట్టుకొని విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొట్టేశారని ఆరోపణలు చేశారు. సిఎం నుంచి సిఎస్‌తో పాటు వైసిపి నేతలు కుమ్మకై వేల ఎకరాలు దోచుకున్నారని ప్రతిపాటి ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత కంపెనీలకు వేల ఎకరాలు కట్టబెట్టారని, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాల భూములను కొట్టేశారని దుయ్యబట్టారు. జగన్, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డితో సహా వైఎస్‌ఆర్‌సిపి అగ్ర నేతల కనుసన్నలో భూకబ్జాలు జరిగాయని ప్రత్తిపాటి ఆరోపణలు చేశారు. అసైన్డ్ భూములపై శాశ్వత హక్కుల పేరుతో పేదల పొలాలను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూఅక్రమాలపై విచారణ జరిపించి, బాధితులకు భూములను అప్పగించడంతో పాటు భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News