Wednesday, January 22, 2025

బంగారు గనిలో ప్రమాదం… 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జకర్తా: ఇండోనేషియా, సులవేసి ద్వీపంలోని బంగారు గనిలో కొండచరియలు విరిగి పడడంతో 11 మంది కార్మికులు మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గనిలో కొండచరియలు విరిగిపడడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. గోరంటాలో ప్రావిన్స్ లోని రిమోట్ బోన్ బొలాంగో ప్రాంతంలో కొందరు గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్టు వార్తా సంస్థల కథనం వెల్లడించింది.

ఈ గనిలో ఆదివారం సుమారు 33 మంది గ్రామస్థులు పనులు చేస్తుండగా, కొండచరియలు ఒక్కసారి విరిగి వారిపై పడినట్టు గోరంటా సెర్చ్ అండ్ రెస్కూ ఏజెన్సీ ప్రతినిధి అఫీపుద్దీన్ ఇలాహుడే తెలిపారు. రక్షక బృందాలు ఆదివారం ఒకరిని రక్షించాయి. సోమవారం 11 మృతదేహాలను వెలికి తీశారు. శిధిలాల్లో చిక్కుకుపోయిన మరో 20 మంది కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News