Wednesday, November 6, 2024

మహారాష్ట్రలో కొండచరియలు విరిగి పడి భారీ ప్రాణ నష్టం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అల్లాడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో నదులు ఉప్పొంగి వరదలు ముంచెత్తుతుండడంతో జనజీవనం అస్తవ్యవస్తమౌతోంది. మహారాష్ట్రలో వర్షాలతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇర్షల్ వాడీ గిరిజన తండాలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య శనివారం నాటికి 26 కు చేరింది. శనివారం మరో నాలుగు మృతదేహాలను శిధిలాల నుంచి వెలికి తీశారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు మహిమధు టిర్కాడ్ (32), అషి పాండురంగ్ (50), భారతి మధు భూతబ్ర (18), కిషన్ టిర్కాడ్ (27) గా గుర్తించారు. ఇంకా మరికొందరి కోసం గత మూడు రోజులుగా గాలింపు జరుగుతోంది. ఎన్‌డిఆర్‌ఎఫ్ తోపాటు మరికొన్ని ప్రభుత్వ సంస్థలు గాలింపులో పాలు పంచుకుంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News