Saturday, April 5, 2025

విరిగిపడిన కొండచరియలు: 100 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పపువా న్యూ గినియా: కొండచరియలు విరిగిపడడంతో వంద మంది మృతి చెందిన సంఘటన పపువా న్యూ గినియా దేశం ఎన్గా ప్రావిన్స్‌లో జరిగింది. కావోకలం గ్రామంలో కొండచరియలు విరిగిపడడడంతో 100 మందికి పైగా గ్రామస్థులు దుర్మరణం చెందారు. సంఘటన పవువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్‌కు వాయువ్య దిశకు 600 కిలో మీటర్ల దూరంలో జరిగింది. భారీగా కొండ చరియలు విరిగిపడడంతో వందల ఇండ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రెస్క్యూ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ గ్రామంలో బంగారు గనులు ఉన్నాయి. అధికారికంగా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News