Sunday, December 22, 2024

త్రిశూలి నదిలో కొట్టుకపోయిన రెండు బస్సులు… 63 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండూ: నేపాల్‌లోని త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకపోయాయి. మదన్-ఆశ్రిత్ జాతీయరహదారిపై నారాయణ్‌గఢ్- మగ్లిన్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. రెండు బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. కొట్టుకపోయిన బస్సుల్లోని ప్రయాణికుల కోసం పోలీసులు, రెస్య్కూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ఫ కమల్ దల్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల కమల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని బయటకు త్వరగా తీసుకరావాలని నేపాల్ పిఎం ఆదేశాలు జారీ చేశారు. బస్సులో ఉన్నవారు అందరూ చనిపోయి ఉంటారని స్థానిక మీడియా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News