Wednesday, January 22, 2025

లంగర్ హౌస్ చోరీ కేసు ఛేదింపు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లంగర్ హౌస్ చోరీ కేసును పోలీసులు ఛేధించారు. కాకతీయ నగర్ లో దొచుకెళ్లిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాకతీయ నగర్ లో ఓ కుటుంబం షాపింగ్ వెళ్ళారు. షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి బీరువాను పగులగొట్టి 45 తులాల బంగారం, కిలో వెండిని చోరీ చేయడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డెవిస్ తెలిపారు.  దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ ను ఏర్పాటు చేశామని, ఎవరు చోరీ చేశారు అనే దానిపై నిర్దారణకు వచ్చామని, ఈ దోపిడీలో ఇద్దరు ప్రమేయం ఉందని తేల్చామని, నిందితులు చోరీ చేసిన సొత్తుతో కర్ణాటక సరిహద్దులో తిరిగినట్టు గుర్తించి వారిని అరెస్టు చేశామని వెల్లడించారు.

నిందితుల వద్ద నుంచి మొత్తం 51 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి సీజ్ చేశామని డిసిపి వెల్లడించారు. ఈ కేసులో భరత్ కుమార్ శర్మ ప్రధాన నిందితుడుకాగా 88 చోరీ కేసులలో అతడి హస్తం ఉండడంతో రెండు సార్లు పిడి యాక్ట్ నమోదు చేశారన్నారు. ఎ2 అనూప్ కుమార్ 9 కేసుల్లో ప్రమేయం ఉందని, రెండు సార్లు పిడి యాక్ట్ నమోదు చేయడంతో జైలుకు వెళ్ళాడు. ఎ3 సుంకం రాజు బెంగుళూరులో ఓ హత్య కేసులో ప్రమేయం ఉండడంతో పాటు ఆ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడని వివరించారు. ఎ1, ఎ2 నిందితులు ఇద్దరు రెక్కీ చేసి కాకతీయ నగర్ కలిసి చోరీ చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు రాహుల్ కుమార్ శర్మ ఓ ఇంట్లో పని చేశాడు. ఆ ఇంట్లో నగలు ఉన్నాయని ఎ2, ఎ3కి సమాచారం ఇవ్వడంతో వీళ్ళు కాకతీయ నగర్ లో సదరు ఇంటిలో బీరువా బ్రేక్ చేసి 15 నిమిషాల్లోనే చోరీ చేశారు. 100 సిసి కెమెరాలు పరిశీలించిన అనంతరం ఈ కేసు ఛేదించామని డిసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News