Wednesday, January 15, 2025

లంగర్‌హౌస్‌లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని లంగర్‌హౌస్‌లో మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎల్ కాలనీకి చెందిన అశోక్‌గా గుర్తించారు. అశోక్ అనారోగ్యంతో మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని అన్నాచెల్లెలు రాజు, స్వరూప ముక్కలుగా నరికారు. పాలిథిన్ కవర్లలో మొండెం, కాళ్లు, చేతులు కట్టి ఆటోలో తీసుకొచ్చి దర్గా సమీపంలో పడేశారు. మద్యానికి బానిసగా మారిన అశోక్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స చేసినా ఫలితం ఉండకపోవడంతో డాక్టర్ల చెప్పడంతో ఇంటికి తరలించారు. లంగర్‌హౌస్ పోలీసులు మాత్రం హత్య కేసు నమోదు చేశారు. అన్నాచెల్లెలు రాజు, స్వరూప లంగర్‌హౌస్ పోలీసుల అదుపులో ఉన్నారు.

Also Read: డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని కేటాయించారు : బండి సంజయ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News