పార్టీలకు లంక అధ్యక్షులు రాజపక్సా పిలుపు
కొలంబో : దేశంలో దారుణ ఆర్థిక పరిస్థితి ఏర్పడిన తరుణంలో రాజకీయ పార్టీలు సంకుచిత ధోరణిని వీడాలని చిక్కులు చుట్టుముట్టిన శ్రీలంక అధ్యక్షులు గొటాబాయ రాజపక్సా కోరారు. పార్టీలు ఇప్పటి దశలో రాజకీయ విభేదాలనుపక్కకు పెట్టాలి, ఆర్థిక కడగండ్లను తొలిగించేందుకు ప్రజా పక్ష పోరుకు దిగవచ్చునని తెలిపారు. రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రభుత్వంతో ఘర్షణ ధోరణిని మానుకోవల్సి ఉంది. ప్రజలకు మేలు చేసే దిశలో ఓ సరికొత్త ఉద్యమం కోసం పార్టీలు పాటుపడాల్సి ఉందన్నారు. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు సమిష్టిగా వ్యవహరిస్తేనే దేశానికి ప్రజలకు మేలు జరుగుతుందని తెలపారు. రాజపక్సా ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో తాను మరోసారి ప్రతిపక్షాలు ఆందోళనల బాట వీడాలని కోరుతున్నట్లు రాజపక్సా తెలిపారు. అశాంతి సంఘర్షణలతో కోట్లాది మంది కార్మికులు నష్టపోతారని, ఈ పరిణామం తలెత్తకుండా చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మరో వైపు ప్రభుత్వ అసమర్థతకు ఫలితంగా తలెత్తిన ఆర్థిక సంక్షమానికి నిరనగా ప్రజలు ఇప్పుడు ఆదివారం బ్లాక్ మే డే నిర్వహించాలని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస పిలుపు నిచ్చారు. ఈ ప్రభుత్వం నుంచి విముక్తికి పాటుపడాల్సి ఉందన్నారు.