Monday, December 23, 2024

ఆధునిక భారతీయ జీవనానికి ప్రతీకగా ‘అరియాస్‌ కలెక్షన్‌’: లారా దత్తా

- Advertisement -
- Advertisement -

ముంబై: నిల్‌కమల్‌ లిమిటెడ్‌కు చెందిన వాణిజ్య విభాగం @హోమ్‌, సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి లారాదత్తా కలిసి ప్రత్యేక శ్రేణి హోమ్‌ డెకార్‌ కలెక్షన్‌–అరియాస్‌ను విడుదల చేశారు. లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌లో డైనింగ్‌, బెడ్డింగ్‌, బాత్‌ విభాగానికి చెందిన పలు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉంటాయి.

అరియాస్‌ కలెక్షన్‌లో అత్యంత అందంగా తీర్చిదిద్దిన గ్లాస్‌వేర్‌ సైతం భాగంగా ఉంది. ఎలాంటి డైనింగ్‌ పరిస్థితిలకైనా ఆహ్లాదాన్ని తీసుకువచ్చే రీతిలో ఈ కలెక్షన్‌ ఉంటుంది. దీనితో పాటుగా మీ డైనింగ్‌ అనుభవాలను మరుపురాని రీతిలో మలిచే ప్రత్యేకమైన కట్లరీ, బెడ్‌షీట్స్‌కు తగినట్లుగా పిల్లో కవర్స్‌, చార్‌కోల్‌ స్ఫూర్తితో మెమరీ ఫోమ్‌ పిల్లర్లు ఉంటాయి. ముర్తాజా మంగ్లోర్వాలా–సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌–బయింగ్‌ అండ్‌ మర్చండైజింగ్‌ ఫర్‌ @హోమ్‌ మాట్లాడుతూ.. ‘‘సృజనాత్మక హోమ్‌ మేకోవర్‌ ఆలోచనలు కలిగిన వినియోగదారులకు అత్యుత్తమ కేంద్రంగా @హోమ్‌ ఉంటుంది. లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌ కలెక్షన్‌ @హోమ్‌ బ్రాండ్‌ సిద్ధాంతాన్ని అత్యుత్తమంగా చూపడంతో పాటుగా బహుళ విభాగాలలో వినియోగదారులకు విస్తృతశ్రేణి అవకాశాలను అందిస్తుంది’’ అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి లారాదత్తా మాట్లాడుతూ ‘‘ఆధునిక భారతీయ జీవనానికి ప్రతీకగా.. ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ సమ్మేళనంగా అరియాస్‌ కలెక్షన్‌ ఉంటుంది. కాలాతీత ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ను ఖచ్చితత్త్వంతో అందించాలనే నా అభిరుచికి అరియాస్‌ నిదర్శనం. @ హోమ్‌ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. అరియాస్‌ ఉత్పత్తులు @హోమ్‌ స్టోర్లు, www.at-home.co.in వద్ద అలాగే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల వద్ద కూడా లభ్యమవుతాయి.

Lara Dutta design Arias Collection

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News