Wednesday, November 13, 2024

విజయవాడ స్టేషన్ యార్డులో భారీ ఎత్తున మార్పులు

- Advertisement -
- Advertisement -

Large scale changes in Vijayawada station yard

దీంతో రైళ్ల నిరీక్షణ సమయం తగ్గడం, సెక్షన్ సామర్థ్యం మెరుగవుతోంది
ప్రధానంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాపోకలకు సౌలభ్యం ఏర్పడుతోంది
దక్షిణ మధ్య రైల్వే అధికారులు

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ స్టేషన్ యార్డులో ఇంటర్‌లాకింగ్ సిస్టంతో సహా పెద్ద ఎత్తున యార్డులో మార్పులుచేర్పులను చేపట్టింది. దీంతో రైళ్ల రాకపోకల్లో ముఖ్యంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో మెరుగైన సౌలభ్యం ఏర్పడుతుంది. భారతీయ రైల్వేలో విజయవాడ జంక్షన్ ప్రధాన జంక్షన్‌లలో ఒకటి. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నాలుగు వైపుల ప్రాంతాల రైళ్ల రాకపోకలకు ఈ జంక్షన్ కీలకమయ్యింది.

గతంలో సికింద్రాబాద్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు సికింద్రాబాద్ మార్గాల్లో ఒకేసారి రైళ్ల రాకపోకలు సాగించినప్పుడు రైళ్లు నిరీక్షించాల్సి వచ్చేది. ఈ రైళ్లను ఆపినప్పుడు ఇతర మార్గల్లో వచ్చే రైళ్ల రాపోకలపై ఈ ప్రభావం పడేది. ఈ సమస్యలను అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడలోని ఉత్తర భాగం యార్డులో మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా, నూతన క్యాబిన్ ఏర్పాటు చేయగా, మరో క్యాబిన్ మార్చారు. ప్రస్తుతమున్న రెండు క్యాబిన్‌లలో మార్పులు, చేర్పులు చేశారు.

32 రూట్లతో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఈఐ)తో నూతన బల్బ్ క్యాబిన్ ఏర్పాటు న్యూవెస్ట్ బ్లాక్ హట్ (ఎన్‌డబ్ల్యుబిహెచ్) క్యాబిన్‌ను మార్చగా, 1.5 కి.మీ నూతన లైన్‌తో 20 రూట్లతో అనుసంధానించబడిందని, ప్రస్తుత క్యాబిన్లు ‘బల్బ్ క్యాబిన్’లో ‘డి క్యాబిన్’లో మార్పులు చేపట్టామని అధికారులు తెలిపారు.

ప్రధాన జంక్షన్‌లో కలిగే ప్రయోజనాలు

క్యాబిన్‌ల మార్పులతో ప్రధానంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకల నిర్వహణలో క్రాసింగ్‌లను చాలా వరకు నివారించవచ్చు. దీంతోపాటు ఏకకాలంలో రైళ్ల రవాణా సాధ్యపడుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం, విజయవాడ టు విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో రైళ్ల నిరీక్షణను అధిగమించవచ్చు. సెక్షనల్ సామర్థ్యం పెంపుతో మరిన్ని రైళ్ల నిర్వహణకు అవకాశాలు ఏర్పడుతాయని అధికారులు తెలిపారు. సెక్షన్‌లో రైళ్ల సగటు వేగం పెంపునకు అవకాశాలు ఏర్పడడంతో పాటు యార్డులో రైళ్ల రాకపోకలు నిరాటంకంగా, సజావుగా సాగేందుకు అవకాశాలు ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

అభినందించిన రైల్వే జిఎం

ఈ మౌలిక సదుపాయాలను త్వరగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన విజయవాడ డివిజన్, కనస్ట్రక్షన్ ఆర్గనైజేషన్, ప్రధాన కార్యాలయం అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. రద్దీ జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్‌లో భారీ ఎత్తున చేపట్టిన యార్డు మార్పులతో బహుళ క్రాసింగ్‌లను నివారించి రైళ్ల సర్వీసులను సజావుగా నిర్వహించడానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News