Tuesday, January 21, 2025

బిఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున యువకుల చేరిక

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల 132 డివిజన్ న్యూ వివేకానంద్‌నగర్ కు చెందిన యువకులు బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్దఎత్తున బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శా ఖ మంత్రి కెటిఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆ దర్శంగా నిలుస్తుందని అన్నారు. పార్టీలో చేరిన యువకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీలో చేరిన కేమ శ్రీనివాస్ బృందం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News