Monday, December 23, 2024

రిపబ్లిక్‌డే పరేడ్‌లో 75 యుద్ధ విమానాలతో ప్రదర్శన: ఐఎఎఫ్

- Advertisement -
- Advertisement -

Largest Flypast With 75 Aircraft On Republic Day This Year: IAF

 

న్యూఢిల్లీ: ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించే పరేడ్‌లో 75 యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొంటాయని భారత వైమానిక దళం(ఐఎఎఫ్) కమాండర్ ఇంద్రాణిల్‌నంది తెలిపారు. ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహించనున్న సందర్భంగా రిపబ్లిక్ వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏడు జాగ్వార్ ఫైటర్లతోపాటు ఎంఐ17, మిగ్ 21, రఫేల్ యుద్ధ విమానాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. అయితే, దేశంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో రిపబ్లిక్ వేడుకలకు పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అనుమతి ఇస్తారు. సందర్శకుల సంఖ్యను 24,000కు పరిమితం చేయనున్నారు. కరోనా మహమ్మారికి ముందు 2020లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు దాదాపు లక్షా 25 వేలమంది హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News