Monday, December 23, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద ‘జాతీయ జెండా మానవ హారం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చండీగఢ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, వాలంటీర్లు ఎన్‌ఐడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతిపెద్ద జాతీయ జెండా మానవహారంగా నిలబడి రికార్డు సృష్టించారు. విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్ స్టేడియంలో దాదాపు 5 వేల మందితో జాతీయ జెండా మానవ హారం ప్రదర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది.

కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షి లేఖి, యూనివర్శిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ దృశ్యాలను ట్విటర్‌లో మంత్రి పాలుపంచుకున్నారు. ఇది దేశానికి గర్వకారణమైన సమయం. గౌరవనీయులైన గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ జీ సమక్షంలో క్రికెట్ స్టేడియంలో ఈ మానవ హారం ప్రపంచ గిన్నిస్ రికార్డును సాధించిందని మంత్రి తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Largest human image of waving national flag in Chandigarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News