Monday, December 23, 2024

నాడు 174… నేడు 2518 పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది, వాటిలో ముఖ్యంగా టిఎస్ ఐ పాస్‌ను 2014లో అమలు చేయడంతో పరిశ్రమలు ఏర్పాటుకు సులభ తర విధానంలో అనుమతులు లభించడంతో భారీ ఎత్తును పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఏర్పడిందని ఎస్‌ఇఒ( తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖ చిత్రం ) తెలిపింది.టిఎస్ ఐ పాస్ ఏర్పాటుతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనలో పరిపాలాన భారం చాలావరకు తగ్గడమే కాకుండా దీని ప్రకారం అన్ని ప్రాజెక్టులకు 30 రోజులవ్యవధిలో అనుమతులు లభిస్తాయి. ఒక వేళ అనుమతి లభించక పోతే 31వ రోజు అనుమతి లభించినట్లే. ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్ ప్రకారం ఇది దేశవ్యాప్తంగా అతి తక్కువ వ్యవధిలో గుర్తించబడి సంస్థగా పేరు పొందింది.

పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రం ఇచ్చిన“ క్లియరెన్స్ హక్కు”ను అమలు చేయడంలో ఈ వ్యవస్థ ఎంతోకీలకంగా మారినట్లు పేర్కొంది. 2016 నుంచి పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం ( డిపిఐఐటి) ద్వారా సంకలనం చేయబడిన ఈజ్ ఆఫ్‌డూయింగ్ బిజినెస్ (ఈవోడిబి)లోతెలంగాణ ఉన్నత ర్యాకింగ్‌తో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. టిఎస్ ఐ పాస్ ద్వారా ప్రభుత్వం 202223 ( జనవరి 2023) నాటికి రూ. 20, 237 కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించడం ద్వారా 2518 కొత్త పరిశ్రమల ఏర్పాటు చేసినట్ల నివేదిక వెల్లడించింది. టిఎస్ ఐ పాస్ ద్వారా 201516 , 202223 మధ్యకాలంలో పుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో పరిశ్రమలకు ఇచ్చిన అనుమతుల సంఖ్యలో నిర్దిష్టమైన పెరుగుదల ఉన్నట్లు టిఎస్‌ఇఒ తన నివేదికలో తెలిపింది.

ఈ సమయంలోనే 8.3 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ది రేటు ( సిఏజిఆర్)ను సాధించిందని, ఇది రాష్ట్రం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆహార విధానం( తెలగాణ ఫుడ్‌పాలసీ)ని ప్రతిభింప చేస్తున్నట్లు తెలిపింది. సిమెంట్, ఉత్పత్తుల మొత్తం రాబడిలో వాటా ఆకర్షణీయంగా పెరుగుతోందని, 2015 16లో మొత్తం పెట్టుబడుల్లో 0. 4 శాతం నుంచి 202223 నాటికి 10. 3 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు 202223లో 17.8 శాతం ఉండగా ఇది 2015 16లో 1.8 శాతం మాత్రమే ఉందని తెలిపింది. ఉపాధి ఫార్మాస్యూటికల్ రంగం నుంచి 15.1 శాతం ఉపాధి లభించింది. సంగారెడ్డి జిల్లా సుల్తానాపూర్‌లోని మెడికల్ డివైజస్ పార్క్, హైదరాబాద్‌లోని ఫార్మాసిటీ ద్వారా కొత్త పెట్టుబడులను, ఉపాధిని ఆకర్షించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని నివేదికలో పేర్కొంది.

టిఎస్ ఐ పాస్ ద్వారా రాష్ట్రంలోకి వచ్చిన పరిశ్రమలు,పెట్టుబడుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ః
సంవత్సరం పరిశ్రమలు పెట్టుబడులు
2014-15    174 ….
2015-16    1531 28,979
2016-17    1705 34,236
2017-18    2803 58278
2018-19    2796 34508
2019-20    3036 40521
2020-21    3431 16094
2021-22    4116 18916
2022-23( జనవరినాటికి) 2518 20,237

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News