Sunday, December 22, 2024

22న సచివాలయం వద్ద 750 డ్రోన్లతో ‘లేజర్ మెగా డ్రోన్’ షో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 22న తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్మృతి వనంల వద్ద సుమారు 750 డ్రోన్లతో ‘లేజర్ మెగా డ్రోన్’ల షో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ,యువజన సర్వీసుల శాఖల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ డ్రోన్ల షో సందర్భంగా ప్రదర్శించే డ్రోన్లను మంగళవారం హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్ తదితరులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లా కేంద్రాల వద్ద దేశంలోనే తొలిసారిగా రూరల్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి మొట్టమొదటిసారిగా మహబూబ్‌నగర్ లోనూ సుమారు 400 డ్రోన్‌లతో “ డ్రోన్ లేజర్ షో” లను నిర్వహిస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ షో తర్వాత వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాలలోనూ లేజర్ షోలను ప్రదర్శిస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తన్మయి, భాస్కర్ రెడ్డి, అనంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News