Monday, December 23, 2024

బోనాలకు ఉత్సవాలకు ముస్తాబైన లష్కర్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః బోనాల ఉత్సవాలకు లష్కర్ ముస్తాబైంది. ఈ నెల 9,10 తేదీల్లో జరగునున్న బోనాల వేడుకలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ఆదివారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి నేడు బోనాలను సమర్పించనుండగా, సోమవారం రంగం (జాతర) జరగనుంది. ఈ ఏడాది బోనాల ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి రానుండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేశారు.శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. బోనాల పండుగ సందర్భంగా ఎక్కడిక్కకడ ప్రత్యేక లైంటింగ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారు 4 గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో పాటు పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శనానికి రానుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులతో పాటు పలువురు ప్రముఖులతో పాటు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనుండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తోలిబోనం సమర్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది మరింత పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానుండడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. బోనాల సమర్పణతో అమ్మవారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకోనుండడంతో భక్తులు ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమారు పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐలు, పోలీసులతో కలిపి సుమారు 2500 మంది బందోబస్తు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు .అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాలకు అదనంగా ఈ సారి 300 లకు పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు భద్రత చర్యలను పర్యవేక్షించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా దేవాలయం పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రధాన రహదారులలో ట్రాపిక్ ను మళ్ళించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులకు అందించేందుకు త్రాగునీటిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని ప్రధాన రోడ్లతో పాటు ఆలయానికి భక్తులు వచ్చే అన్ని రోడ్లలో కూడా ప్రత్యేక లైంటిగ్‌ను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఆలయ పరిసరాలలో రోడ్లును పూర్తిగా మరమ్మతులు చేయడంతో పాటు వర్షం కురిసినా డ్రైనేజీలు, నాలాల పొంగి పోర్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉత్సవాలు జరగనున్న ఈ రెండు రోజుల పాటు ఆలయంతో పాటు పరిసరాల ప్రాంతాల పరిశుభ్రతకు జిహెచ్‌ఎంసి ప్రత్యేకంగా పారిశుద్ద కార్మిక బృందాలను నియమించింది. అదేవిధంగా అదేవిధంగా జలమండలి భక్తుల దహార్తిని తీర్చనుండగా, జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సోమవారం రంగం కార్యక్రమం అనంతరం అమ్మవారి అంబారి ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూం ద్వారా తాజా పరిస్థితులను ఎప్పటిప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News