Saturday, November 2, 2024

పాక్‌లో మరో లష్కరే కమాండర్ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాక్‌లో ఉగ్రవాదులు వరసగా హతమై పోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని మట్టుబెడుతున్నారు. గత 20 నెలల్లో 19 మంది కీలక ఉగ్ర కమాండర్లు ఇలా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. లష్కరే తోయిబా ఉగ్రనేత అక్రమ్ ఖాన్ ఘాజీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వాజా ప్రావిన్స్‌లోని బజార్ జిల్లాలో శుక్రవారం కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని బైటికి పొక్కకుండా చూడడానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రయత్నించినట్లు ఆ కథనాలు తెలిపాయి. అక్రమ్ ఖాన్ 2018 2020 మధ్యకాలంలో లష్కరే తోయిబాకు అవసరమైన నియామకాలు చేట్టేవాడు.గత రెండేళ్లుగా కశ్మీర్ లోయలోకి చొరబడుతున్న పాక్ ఉగ్రవాదులకు ఇతను భారత వ్యతిరేక పాఠాలు చెప్తున్నాడు.

గత 20 నెలల్లో హత్యకు గురయిన 19వ ఉగ్రవాది ఇతను. ఈ హత్యతో అప్రమత్తమయిన పాక్ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రత్యర్థులు, ఇతర ఉగ్ర గూపుల పాత్ర, లష్కరే తోయిబాలో అఅంతర్గత విభేదాలు వంటి కోణాలను పరిశీలిస్తున్నారు.గత మూడు నెలల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్లు హతం కావడం ఇది రెండో సారి.గత సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్ కోట్‌లోని ఒక మసీదు బయట లష్కరే సీనియర్ కమాండర్ రియాజ్ అహ్మద్‌ను కాల్చి చంపారు. గ్నిఘా సంస్థ ఐఎస్‌ఐ నియంత్రణలోనే లష్కరే తోయిబా సంస్థ పని చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ వారంలో హత్యకు గురయిన షాహిద్ ఖ్వాజా కూడా లష్కరే ఉగ్రవాదే. ఇతను 2018లో భారత్‌లోని సుంజ్వాన్ సైనిక క్యాంప్‌పై జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి. ఈ వరస హత్యలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు కూడా భారీ దెబ్బలే తగిలాయి.గత నెలలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు అత్యంత సన్నిహితుడైన దావూద్ మాలిక్‌ను కరాచీలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News