Friday, December 20, 2024

రేపు బోనమెత్తనున్న లష్కర్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిబోనాల ఉత్సవాలకు లష్కర్ ముస్తాబైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పునాకలతో సికింద్రాబాద్ మారుమోగనుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి తొలి బోనం సమర్పణ ఉత్సవాలు ప్రారంభం కానున్నా యి. భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకోనున్నారు.

అదేవిధంగా సోమవారం రంగం (జాతర)లో భాగంగా భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మొండామార్కెట్ ఆదయ్యనగర్ కమాన్ వద్ద నిర్వహించనున్న పాల్గొనున్నారు. అ తర్వాత కవిత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.

బోనాల వేడుకలకు ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 3వేల మంది పోలీసులతో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు అమ్మవారి ఆలయం ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే ఈ కంట్రోల్ రూం అధికారులు వెంటనే సరిదిద్దనున్నారు.

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను సందర్భంగా ఆది, సోమవారం ఈరెండు రోజులపాటు అ మ్మవారి ఆలయం పరిసరా ప్రాంతాల్లోని అన్ని ప్రధాన రహదార్లులో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పలు మార్గాల్లో ఈరెండు రోజులపాటు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. జాతర ముగిసేవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని కమిషనర్ వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చే రైల్వే ప్రయాణికులు కొంత ముందుగా బయలు దేరాలని అదేవిధంగా అల్పా కేఫ్ నుంచి కాకుండా చిలకగూడ వైపు నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు.

ఆదివారం తెల్లవారుజాము నుంచే కర్బాలా మై దాన్, రాణిగంజ్ , పాత రాంగోపల్ పేట్ పోలీసుస్టేషన్, ప్యారడైజ్, సిటిఓప్లాజా, వైఎంసిఎ ఎక్స్‌రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, ప్యాట్నీ ఎక్స్‌రోడ్ పార్క్‌లైన్ మార్గాల్లో వాహనాలను అనుమతించబోరని తెలిపారు. జాతర పూరైయ్యే వరకు బాటా, ఘాస్‌మండి ఎక్స్‌రోడ్, బైబిల్‌హౌస్, మినిస్టర్ రోడ్ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు.
జాతర ముగిసే వరకు వాహనాలను అనుమతించని రహదారులు
టోబాకో బజార్, హిల్ స్ట్రీట్ నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిని కాలినడక భక్తులకు మాత్రమే అనుమతి.
బాట ఎక్స్‌రోడ్ సుభాస్ రోడ్ మొదలు, రాంగోపాల్ పేట్ పిఎస్‌మార్గం ఆదయ్యనగర్ ఎక్స్‌రోడ్ నుంచి అమ్మవారి ఆలయం వెళ్లే మార్గం. సికింద్రాబా ద్ జనరల్ బజార్ నుంచి అమ్మవారి గుడికి వెళ్లే దార్లులో ఎలాంటి వాహనాలను అనుమతించరు.
దారి మళ్లీంపు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వైపు రాణిగంజ్ ఎక్స్‌రోడ్ మీదగా దారి మళ్లీంపు.
కర్బాలా మైదానం మీదుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వచ్చే వాహనాలు, ఆర్టీసీ బస్సులు మినిస్టర్ రోడ్ మీదుగా రసూల్‌పుర మీదుగా వైఎంసిఎ ఎక్‌సరోడ్ గుండా స్టేషన్‌కు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే బస్సులను చిలకలగూడ ఎక్స్‌రోడ్ మీదుగా, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ ఎక్స్‌రోడ్ మీదుగా కవాడిగూడ మారియట్ హోటల్ ట్యాంక్‌బండ్ మీదగా దారి మళ్లీంపు.
సికింద్రాబాద్ నుంచి బాలానగర్, బేగంపేట్, అల్వాల్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్‌టవర్, వైఎంసిఎ చౌ రస్తా, ఫ్యాట్నీ, ప్యారడైజ్‌లు మీదుగా వెళ్లుతాయి.
ఘాస్‌మండీ ఎక్స్ రోడ్డు గుండా బైబిల్ హౌజ్ నుంచి సికింద్రాబాద్, తిరుమల్ గిరి వైపు వెళ్లే వాహనాలను ఘాస్‌మండి ఎక్స్‌రోడ్ వద్ద సజ్జన్‌లాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హిల్‌స్ట్రీట్, రాణిగంజ్‌వైపు దారి మళ్లీస్తారు.
ఫ్యాటీ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్ బండ్‌వైపు వచ్చే వాహనాలను ప్యాటీ ఎక్స్‌రోడ్ వద్ద దారి మ ళ్లీంచి క్లాక్ టవర్, లేక సంగీత్ ఎక్స్‌రోడ్ మీదగా సికింద్రాబాద్ , చిలకలగూడ చౌరస్తా, మూషీరాబాద్ చైరస్తా నుంచి కవాడిగూడ, ట్యాంక్‌బండ్ గుండా వెళ్లాల్సి ఉంటుంది.
ప్యారడైజ్ ఎక్స్ రోడ్‌కు సంబంధించి సిటిఓ జంక్షన్ నుంచి ఎం.జి రోడ్డు వైపుదారి మళ్లీంచనున్నారు. ప్యారడైజ్ ఎక్స్‌రోడ్ వైపు సింధీకాలనీ కుడి మలుపు మీదగా మినిస్టర్ రోడ్డు గుండా రాణిగంజ్, కుడి మలుపుకర్బాలి మైదాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News