Thursday, April 3, 2025

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో లష్కరే తాయిబాకు చెందిన ఒక ఉగ్రవాది మరణించాడు. 2017లో సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను అపహరించి హతమార్చిన ఘటనతో ఈ ఉగ్రవాదికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోటిగామ్ గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నట్లు నిర్దిష్టమైన సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా దళాలు గాలింపు మొదలుపెట్టాయి. ఉగ్రవాది దాక్కుని ఉన్న ప్రదేశానికి భద్రతా బలగాలు చేరుకోగా వారిపై ఉగ్రవాది కాల్పులు జరిపాడు. భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించగా ఆ ఉగ్రవాది మరణించాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని బిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. ఈనేక హత్యలతో అతని ప్రమేయం ఉందన్న పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News