- Advertisement -
కీవ్: చివరి బ్యాచ్ భారతీయ విద్యార్థులు యుద్ధ కేంద్రమైన తూర్పు ఉక్రెయిన్‌ను విడిచి పశ్చిమ దిశగా పయనిస్తున్నట్లు భారత్ బుధవారం తెలిపింది.వారు త్వరలో పొరుగు దేశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి స్వదేశానికి తీసుకురాబడతారు. ఉక్రెయిన్ జీవ పరిశోధనా కేంద్రాలపై రష్యా నియంత్రణను ఏర్పాటుచేసుకోవాలనుకుంటోందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. క్షిపణి దాడులకు అవకాశం ఉందని పేర్కొంటూ బుధవారం రాజధాని కీవ్ చుట్టూ గగనతల హెచ్చరికను ప్రకటించారు. వీలయినంత త్వరగా బాంబ్ షెల్టర్‌కు నగరవాసులను తరలించాలని కోరారు.
- Advertisement -