మన తెలంగాణ / హైదరాబాద్ : మార్చి 2023లో జరుగనున్న పతవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ నవంబర్ 15 అని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఎస్‌సి, ఒఎస్‌ఎస్‌సి, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 15 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.50ల అపరాధ రుసుముతో నవంబర్ 30 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 15, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్‌లను సంప్రదించాలని సూచించారు. వెబ్‌సైట్ www.bse.telangana.gov.in ను కూడా సందర్శించవ్చని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు ఫీజు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ. 110, మూడు సబ్జెక్టుల కంటె ఎక్కువ ఉన్నట్లైతే రూ. 125 చెల్లించాలని సూచించారు. ఒకేషన్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుకు అదనంగా రూ. 60 చెల్లించాలి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు మొదటి సారి పరీక్షలకు హాజరు అవుతున్న వారు తల్లిదండ్రుల వార్శిక ఆదాయం రూ.24 వేలకు మించనట్లైతే ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.