- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫీజుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 2023లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపుకు గడువును నవంబర్ 24గా నిర్ణయించింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కూడా సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించవచ్చు.
రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 5, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 15 వరకు రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. మరిన్ని వివరాల కోసం హెడ్ మాస్టర్లను సంప్రదించాలని సూచించారు. https://www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అయి వివరాలు తెలుసుకోవచ్చు.
- Advertisement -