- Advertisement -
హైదరాబాద్ : బిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే కోర్సులు, ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తి విద్యా కోర్సులను బిసి సంక్షేమ గురుకులాల్లో అందిస్తున్నారు. 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ ఏప్రిల్ 16తో ముగుస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిసి గురుకుల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసేందుకు వీలుగా http://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 040 – 23328266, 23322377 నెంబర్‌లకు సంప్రదించవచ్చన్నారు.
- Advertisement -