Sunday, January 19, 2025

రూ 2000 నోట్ల మార్పిడి మరో వారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో రద్దయిన రూ 2000 కరెన్సీ నోటు మార్పిడికి అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇప్పుడు అక్టోబర్ 7వ తేదీ వరకూ పొడిగించింది. రెండు వేల నోట్ల మార్పిడికి ముందు ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 30 (శనివారం) తుదిగడువు విధించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ గడువును మరో వారం వరకూ పొడిగిస్తున్నట్లు ఆర్‌బిఐ ఓ ప్రకటన వెలువరించింది. ఇప్పటివరకూ మొత్తం మీద రూ 3.42 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఆర్‌బిఐకి తిరిగి చేరాయి. మే 19 నుంచి లెక్కచూస్తే ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నోట్లు బ్యాంక్ శాఖల్లో డిపాజిట్ చేయడం కానీ మార్పిడి చేయడం కానీ జరిగింది. ఈ ఏడాది మే నెల 19 వరకూ చలామణిలో ఉన్న రెండువేల రూపాయిల మొత్తం నోట్లతో పోలిస్తే వెనకకు వచ్చిన నోట్ల విలువ 96 శాతంగా ఉందని ఆర్‌బిఐ తెలిపింది. ఎవరి వద్ద అయినా ఈ రెండు వేల నోటు ఉంటే, ఇవి ఇప్పుడు పెంచిన గడువు మేరకు అధికారికంగా అక్టోబర్ 7వ తేదీ వరకూ చెల్లుబాటు అవుతాయి. అయితే వీటి మార్పిడి కేవలం ఆర్‌బిఐ కార్యాలయాలలోనే వీలవుతుంది. వీటిని బ్యాంక్ శాఖలలో మార్చడం లేదా డిపాజిట్ చేయడం కానీ కుదరదని ఆర్‌బిఐ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News