Saturday, November 23, 2024

ఈ కష్టాలు ఇక కొన్నాళ్లే: ప్రజలకు కాంగ్రెస్ భరోసా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పెరిగిన ధరలతో ప్రజలు జరుపుకునే ఇది చివరి దీపావళి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. 2024లో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల పెరుగుదలను, ప్రధాని స్నేహితుడికి ప్రయోజనాలను చేకూర్చే విధానాలను తక్షణమే మారుస్తుందని కాంగ్రెస్ ప్రకటించింది.

సంతోషాన్ని తీసుకువచ్చే పండుగలు మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు 90 శాతానికి పైగా పెరిగి కిలో ఉల్లి రూ. 100కు చేరుకవలో ఉందని ఆయన తెలిపారు. కందిపప్పు ధర కూడా 40 శాతం పెరిగి కిలో రూ. 152కి చేరుకుందని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News