Thursday, January 23, 2025

నాంపల్లి ఎగ్జిబీషన్ సందర్శకులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ సందర్శకులకు మెట్రో సంస్థ వారు గుడ్ న్యూస్ చెప్పారు. మెట్రోలో ఆఖరి రైలు 11 గంటలకు బయలు దేరుతుండగా నుమాయిష్ ముగిసి చివరి తేది వరకు చివరి మెట్రో రైలు 12 గంటలకు బయలుదేరుతుందని మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నగరంలో నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవలు పొడగింపు కొనసాగుతుందని సూచించారు. మియాపూర్, ఎల్‌బినగర్, నాగోల్; రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులు బాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్టా గాంధీభవన్ మెట్రో స్టేషన్‌లో టిక్కెటు కౌంటర్లను 6కు పెంచినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News