Sunday, December 22, 2024

లాభాలు ఆవిరి.. అమ్మకాలకే ఇన్వెస్టర్ల మొగ్గు

- Advertisement -
- Advertisement -

ముంబై : గతవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్‌లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం శుక్రవారం సెన్సెక్స్ 259 పాయింట్లు కోల్పోయి ఆఖరికి 62,979 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ మళ్లీ 63,000 దిగువకు పడిపోయింది. గత వారం మొత్తం ఐదు సెషన్లలో మార్కెట్ సెన్సెక్స్ 458 పాయింట్లను కోల్పోయింది. లాభాల స్వీకరణ కారణంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటి స్టాక్స్‌తో సహా మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 435 పాయింట్ల పతనంతో 34,800 వద్ద ముగిసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 126 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయింది.

Also Read: ఎదురు ఇంట్లోకి చొరబడి.. ఇద్దర్ని చావబాదిన అడ్వకేట్

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ మార్కెట్ క్యాప్ రూ.292.30 లక్షల కోట్లుగా ఉండగా, శుక్రవారం ఇది రూ.289.45 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదకు రూ.2.85 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గత రెండు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.5 లక్షల కోట్లు నష్టపోయారు. అయితే బుధవారం మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. భారతదేశం పటిష్టమైన వృద్ధి గణాంకాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది.
సెన్సెక్స్ సూచీ 63,588 పాయింట్లతో జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.

జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, వియత్నాం, శ్రీలంక వంటి దేశాల ఇండెక్స్‌లు ఇప్పటికీ లాభాల్లోకి వెళ్లడం లేదు, అయినప్పటికీ ఈ సంవత్సరం భారత్ మార్కెట్లు 4 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. కానీ సెన్సెక్స్ మొదటి ఇండెక్స్ ఈ సంవత్సరం రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా 40 పాయింట్ల లాభంతో రికార్డు స్థాయిలో18,856 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు ఎనిమిది నెలల స్థిరీకరణ తర్వాత సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠానికి చేరుకుందని యస్ సెక్యూరిటీస్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ అమర్ అంబానీ అన్నారు.

Also Read: పట్నంలో ఎన్నికల హీట్?

రుతుపవనాలు గనుక బాగున్నట్లయితే ఈ ఏడాది భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఉత్తమంగా ఉంటుంది. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) ఇన్వెస్టర్లు భారత్ ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం(202324)లో విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.73,812 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం(202223) ఆఖరి రెండు త్రైమాసికాల్లో నికర విక్రేతలుగా ఉన్నారు. మార్చి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు బాగుండడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల భారత్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

Also Read: విజిలెన్స్ దాడుల్లో లంచాల అధికారి లీల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News