Friday, November 15, 2024

ఎంఎల్ఎ ల్యాస నందిత అంత్యక్రియలు పూర్తి

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ ః బిఆర్‌ఎస్ ఎంఎల్ఎ లాస్య నందిత అంత్య క్రియలు శుక్రవారం సాయంత్రం మారెడ్‌పల్లి స్మశాన వాటికలో పూరైయ్యాయి. అధికారిక లాంఛనాలతో ఆమెకు తుది విడ్కోలు పలికారు. గాంధీ ఆసుపత్రి నుంచి లాస్యనందిద పార్ధివ దేహం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోగానే అక్కడ ఒక్కసారిగా విషాద చాయలు అలుపుకొన్నాయి. ల్యాస నందిత మృతదేహాన్ని చూసున్న బిఆర్‌ఎస్ శ్రేణులు కంటోన్మెంట్ వాసులు ఒక్కసారిగా కన్నీరుమూన్నీరైయ్యారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అశేష జనవాహిని మధ్య లాస్య నందిత కొనసాగిన అంతిమ యాత్ర. ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్ర గృహ లక్ష్మీ కాలనీ,

,కార్ఖనా, పికెట్, ఏ ఓ సి సెంటర్,మహేంద్ర హిల్స్, మీదుగా మారెడ్ పల్లి హిందూ స్మశానానికి చేరుకుంది. ఈ అంతిమ యాత్రలో లాస్య నందిత పార్థివ దేహాం సాడేను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిలు మోశారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం దివంగత సాయన్న మరదలు కుమారుడు పీయూష్ రాఘవ లాస్యనందిత చితికి నిప్పుపెట్టి అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే తండ్రికి తగ్గని గౌరవం.. తనయకు. దక్కింది. గత ఏడాది సాయన్న మరణించడంతో ఆయన అంత్య క్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించ లేదు. ఇప్పుడు మాత్రం లాస్యనందిత అంత్యక్రియలను ప్రభుత్యం అధికారిక లాంచనా లతో నిర్వచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News