Monday, December 23, 2024

ముగిసిన అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Lata Mangeshkar funeral is over

ప్రధాని మోడీ, మహారాష్ట్ర గవర్నర్, సిఎం నివాళి
పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్ తెండూల్కర్ కూడా హాజరు

ముంబయి: గానకోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పూర్తి అధికార లాంఛనాల నడుమ ముగిశాయి. ముంబయిలోని శివాజీపార్కులో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సోదరుడు హృదయ్‌నాథ్ మంగేష్కర్ ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ తదితర రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, రణవీర్ కపూర్, గేయ రచయిత జావేద్ అఖ్తర్, క్రికెటర్ సచిన్ తెండూల్కర్‌తో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులుపెద్ద సంఖ్యలో శివాజీ పార్కుకు తరలి వచ్చి తమ అభిమాన గాయనికి తుది కన్నీటి వీడోలు పలికారు. ఇన్ని రోజులపాటు తమ సోదరి తమతోనే ఉండేవారని, ఇప్పుడు ఆమె లేరని, తాము ఒంటరి వాళ్లమయ్యామని సోదరుడు, కుటుంబీకులు ఆవేదన చెందారు. అంతకు ముందు లతాజీ నివాసంనుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది. లెజెండరీ సింగర్‌కు తుదివీడ్కోలు పలికేందుకు దారిపొడవునా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News