ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్(92) కన్నుమూశారు. 29రోజులుగా ముంబైయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జనవరి 8న కొవిడ్ సోకడంతో లతా మంగేష్కర్ చికిత్స కోసం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆమెను ఐసియులో ఉంచి చికిత్స అందించారు. తర్వాత ఆమె ఆరోగ్యం కొంత మెరుగైనట్లు వెద్యులు తెలిపారు. దీంతో సాదారణ వార్డులోకి ఆమెను షిప్ట్ చేశారు. అయితే, మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఐసియులో వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేస్తున్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో మేటి గాయనీమణులలో ఒకరిగా ఖ్యాతిగాంచిన లతా మంగేష్కర్ 1942లో తన 13వ ఏట తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ భారతీయ భాషలలో ఆమె ఇప్పటివరకు 30 వేలకు పైగా పాటలు పాడారు. గానకోకిలగా పేరుగాంచిన లతను భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోపాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించాయి.
Lata Mangeshkar passes away at 92