Friday, November 22, 2024

మెలోడీ క్వీన్ లతామంగేష్కర్

- Advertisement -
- Advertisement -
Lata Mangeshkar's 92nd birthday
92వ పుట్టినరోజు, ప్రధాని మోడీసహా పలువురి శుభాకాంక్షలు

ముంబయి: లెజెండరీ గాయని లతామంగేష్కర్ మంగళవారం తన 92వ పుట్టినరోజును కుటుంబసభ్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. లతా మంగేష్కర్ 1942లో తన 13 ఏళ్ల వయసు నుంచే నేపథ్యగీతాలు పాడటం ప్రారంభించారు. ఇప్పటివరకు పలు భాషల్లో 25,000కుపైగా పాటలు పాడి అందరినీ అలరించారు. క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా లతకు పేరున్నది. పుట్టినరోజు వేడుక కోసం ఎలాంటి ప్రణాళిక ఆలోచించలేదని, ఇంట్లోనే కుటుంబసభ్యులతో జరుపుకున్నారని ఆమె సోదరి, గాయని ఉషామంగేష్కర్ తెలిపారు.

నేపథ్యగాయనిగా భారతీయ సినిమాకు ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా దేశ అత్యున్నత పురస్కారం భారత్త్న్ర ఆమెను వరించింది. దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డుసహా పలు జాతీయ ఫిల్మ్ అవార్డులను ఆమె అందుకున్నారు. లతామంగేష్కర్‌కు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ, సంగీత దర్శకుడు శంకర్‌మహదేవన్, నటులు ధర్మేంద్ర, రితేశ్ దేశ్‌ముఖ్, గేయ రచయిత గుల్జార్, నిర్మాత విశాల్ భరద్వాజ్ శుభాకాంక్షలు తెలిపారు. నటి జుహీచావ్లా లత పుట్టిన రోజు సందర్భంగా 100 మొక్కల్ని నాటి తన అభిమానాన్ని చాటుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News