ఎల్బీనగర్ : అర్దరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతల కుంట అగమయ్య కాలనీలో జాతీయ ప్రధాన రహదారిపై సుబ్బయ్య హోట్‌ల్‌లో అర్దరాత్రి 1.30 సమయంలో విద్యుత్ షాట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థ్దలిపురం ఇన్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డి కథనం ప్రకారం …. విద్యుత్ అధికారులు ,అగ్ని ప్రమాద అధికారులతో సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు ఫైర్ ఇంజన్ నీటితో మంటలు ఆపడంతో , నాలుగొవ అంతస్తులో నిద్రిస్తున్న 40 మంది హోటల్ సిబ్బందిని వెనుక వైపు మార్గం నుంచి సురక్షితంగా బయటికి తరిలించామన్నారు. హోటల్ ఏసీలు ,ఎలక్ట్రానిక్ వస్తువులు ,ఫ్యాన్స్ ,డైనింగ్ హల్‌లో ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో దగ్ధ్దమయ్యాయి. సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకురావడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు.సుమారు రూ. నాలుగు లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు తెలిపారు. సకాలంలో పోలీసులు ,అగ్ని ప్రమాద అధికారులు స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయని స్థానికులు తెలిపారు.
వనస్థలిపురంలో అర్దరాత్రి అగ్ని ప్రమాదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -