జాతీయం:
15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.
పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు.
ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు.
యశ్వంత్ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి.
పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి.
మూడవ రౌండ్లో ద్రౌపదికి 51 శాతం ఓట్లు రావడంతో గెలుపు ఖాయమైంది.
రాష్ట్రపతి అయిన ప్రథమ గిరిజన మహిళగా.. రెండో మహిళ రాష్ట్రపతిగా ద్రౌపది ఘనత సాధించింది.
ద్రౌపది ముర్ము ప్రొఫైల్
పుట్టినతేది : 20.06.1958
స్వస్థలం : ఉపరబెడ గ్రామం, ఒడిశా
ఎడ్యూకేషన్ : రాజనీతి శాస్త్రంలో డిగ్రీ
రాజకీయ ప్రస్థానం..
1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా ఎన్నిక
రాయ్‌రంగాపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు భాజపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
200004: నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రి.
200609: ఒడిశా భాజపా ఎస్‌టి మోరా అధ్యక్షురాలు
2007: ఒడిశా అసెంబ్లీలో ఉత్తమ ఎంఎల్‌ఎ (నీలకంఠ సన్మాన్) పురస్కారం అందుకుంది.
201521 : జార్ఖండ్ గవర్నర్
2022 జులై 21 : భారత రాష్ట్రపతిగా ఎన్నిక.
ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు..
వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు 2022.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభ ముందుంచారు.
అంటార్కిటికాలో ఉన్న మన దేశానికి చెందిన రెండు కేంద్రాలైన.. మైత్రి, భారతిలలో ఉండే శాస్త్ర వేత్తలకు, వారి పరిశోధనలకు మన చట్టాలు వర్తింపజేసేందుకు బిల్లు ను తీసుకువచ్చామని ఆయన తెలిపారు.
నిధి ఏర్పాటును బిల్లులో ప్రతిపాదించామని ఆయన వెల్లడించారు.
దేశంలో కౌలు రైతులు 17.3శాతం
201819 గణాంకాల ప్రకారం 17.3 శాతం కౌలు రైతులు ఉన్నట్లు జాతీయ గణాంక శాఖ కార్యాలయం వెల్లడించిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు.
వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశమని రైతులకు ఎలాంటి సహాయం అందించాలి.
ఆజాదీకీ రైల్ గాడీ.. ఔర్ స్టేషన్
పలువురు స్వాతంత్య్ర సమరయోధులు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో నాటి పోరా ట సన్నివేశాలు వివరిస్తూ అందరిలో జాతీయ భావాన్ని నింపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఆజాదీకీ రైల్ గాడీ, ఔర్ స్టేషన్ కార్యక్రమలు.
ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కె.చంద్రప్రకాశ్‌రావు, పి.మోహన్‌రావు, జి.గాలయ్యలు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంతో మమేకమై నేటికీ రైల్వేలో సేవలందిస్తున్న ఆనాటి ఏపీ ఎక్స్‌ప్రెస్, ప్రస్తుత తెలంగాణ ఎక్‌ప్రెస్ రైలును హైదరాబాద్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు.
హర్ ఘర్ తిరంగా
హర్ ఘర్ తిరంగాను విజయవంతంగా అమలు చేసేందుకు కేంద్ర సాంస్క్రతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జులై 18న లోక్ సభకు తెలిపారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల్లో ఆగస్టు 15న అన్ని నివాసాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
స్విమ్మింగ్‌లో తెలంగాణకు స్వర్ణం
ఒడిశా భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ స్వర్ణ, రజత పతకాలు సాధించింది. అండర్ 17 బాలికల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో వ్రితి పసిడి పతకం సాధించింది.
2ని:22.16 సెకన్లలో స్విమింగ్ పూర్తి చేసి నెగ్గింది.
400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో (4:29.37 సెకన్లు) రజత పతకం గెలుచుకుంది.
రాష్ట్రాలు:
ఒకేరోజు 53 ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య, విజ్ఞాన సంస్థ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్‌టాస్క్) పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్ 2.0లో ఈ ఒప్పందాలు జరిగాయి.
శంషాబాద్‌లో విమాన విడిభాగాల తయారీ కేంద్రం ప్రారంభం..
ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ శాఫ్రాన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే విమాన నిర్వహణ, మరమ్మత్తుల కేంద్రం (ఎంఆర్‌ఓ) ప్రపంచంలోనే అతి పెద్దదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
రూ. 1200 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ కేంద్రం 2025 నాటికి సిద్ధమవుతుందన్నారు.
మధ్య ప్రాచ్య దేశాలు, దక్షిణాసియా దేశాల నుంచి విమానాలు మరమ్మత్తుల కోసం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి ఎంఆర్‌ఓ కేంద్రం ఇదేనని అన్నారు.
శాంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్‌లో కొత్తగా నిర్మించిన శాఫ్రాన్ విమాన ఇంజిన్ల విడిభాగాల అధునాతన ఉత్పత్తి కేంద్రాన్ని, సమీపంలో ఉన్న శాఫ్రాన్ ఎలక్ట్రికల్, పవర్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఉత్తరాఖండ్‌లో హరిత ఉద్యమం
అడవుల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తే జంతువులు పంట పొలాలపై దాడి చేయకుండా సరికొత్త కార్యక్రమం రూపొందించారు.
వాటికి అడవుల్లోనే పండ్లు, కూరగాయలు మొక్కలు నాటేందుకు విత్తన బాంబులు తయారు చేశారు.
మట్టి, కంపోస్టు ఎరువు, విత్తనాలతో వీటిని రూపొందిచారు. 2017, జులై 9న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ చేతుల మీదుగా ఈ బృహత్కార్కానికి శ్రీకారం చుట్టారు.
ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడిగా అనిల్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా జీవకా ఇం డస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు.
ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు.
ఎఫ్‌టీసీసీఐలో నిర్వహించిన 105వ వార్షిక సాధారణ సమావేశంలో అనిల్ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అంతర్జాతీయం:
శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్దెన
రాజపక్స కుటుంబానికి సన్నిహితుడైన సీనియర్ రాజకీయవేత్త, మహాజన ఏక్‌షాథ్ పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్ గుణవర్దెన (73) శ్రీలంక కొత్త ప్రధానిగా నియమితులయ్యారు.
అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె మొత్తం 18 మంది కేబినెట్ సహచరులతో ప్రమాణ స్వీకారం చేశారు.
అధ్యక్షునిగా విక్రమసింఘె
శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె (73) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయసూర్య సమక్షాన విక్రమసింఘె ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ రాజీనామా
ఇటలీలో రాజకీయ సంక్షోభం తలెత్తింది.
సంకీర్ణ సర్కారులోని కీలక మిత్రపక్షాల మద్దతు కోల్పోవడంతో ప్రధాని మారియో డ్రాఘీ తన పదవికి రాజీనామా చేశారు.
దేశాధ్యక్షుడు సెర్జియో మాటరెలాను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు.
భారత్‌కు మినహాయింపు
రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన భారత్‌కు క్యాట్సా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే చట్ట సవరణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
భారత అమెరికన్ సభ్యుడు రో ఖన్నా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
చైనా వంటి ప్రత్యర్థి దేశం నుంచి రక్షణ కోసం ఈ ఆయుధ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసిందని అందులో పేర్కొన్నారు.
బైడెన్ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి, ఆంక్షల నుంచి మినహాయింపునివ్వాలని కోరారు.
క్యాట్సా..అంటే?
క్యాట్సా ఒక అమెరికా చట్టం.
2014లో క్రిమియాను ఆక్రమించుకోవడంతో పాటు 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ చట్టం తీసుకొచ్చింది.
దీని ప్రకారం రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది.