- Advertisement -
అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ధ్రువ సర్జా పవర్‌ఫుల్ పాత్ర పోషించడానికి ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.
శ్రీరామ నవమి సందర్భంగా ధ్రువ సర్జా ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ధృవ పొడవాటి, జుట్టు, గడ్డంతో మాస్ అప్పీల్‌లో కనిపించారు. హనుమంతుని పేర్లలో ఒకటైన పవన్ పాత్ర అతని మెడలో రుద్రాక్ష మాలతో పరిచయం చేయబడింది. ఇది అతని పవర్‌ఫుల్ స్వభావాన్ని చూపించింది.
- Advertisement -