భీమ్‌గల్ లోని సహస్ర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి తులం బంగారం ఎక్కడ అంటూ ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఆందోళన చేయడం జరిగింది. బి.ఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్అంటూ నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు .అనంతరం బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
వేదిక పైన తులం బంగారం గురించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించడంతో ఇన్నేళ్లు పాలించిన ముఖ్యమంత్రిలు చేసిన అప్పు ఓకే అయితే పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు ఓకే తని ఆయన విమర్శించారు ప్రభుత్వానికి సరిపోతుందని ప్రకటించడంతో వేదికపై ఇరు నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమం అనంతరం మినిస్టర్ వెళుతున్న క్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు చేసిన లాఠీచార్జికి నిరసనగా కార్యకర్తలతో కలిసి ప్రశాంత్ రెడ్డి రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ,ఆర్డిఓ రాజా గౌడ్ ,ఎమ్మార్వో షబ్బీర్ ,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.