Wednesday, January 22, 2025

శబరిమలలో భక్తులపై లాఠీచార్జీ

- Advertisement -
- Advertisement -

రద్దీతో కిక్కిరిసి పోతున్న శబరిగిరులు
పంబ నుంచి శబరిమల వరకు భారీ క్యూ లైన్

హైదరాబాద్ : శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తులను మధ్యలోనే నిలిపి వేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఇలా చేస్తున్నామని ట్రావెన్‌కోర్ అధికారులు చెబుతున్నారు. ఇక, భక్తులకు నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై ఇప్పటికే పలుసార్లు లాఠీఛార్జీ చేశారు. దీంతో కేరళ ప్రభుత్వంపై, పోలీసులపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.

అయితే, అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్ని కిక్కిరిపోయాయి. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతోంది. శబరిమల మార్గ మధ్యలోనే భక్తులను గంటల తరబడి పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రావెన్స్ కోర్ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిల్చుని ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని భక్తులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 10 గంటలకు పైగా భక్తులు మార్గ మధ్యలోనే నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. భారీ క్యూ కారణంగా వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News