Thursday, April 10, 2025

రెచ్చిపోయిన ఖాకీలు…విద్యార్థులపై లాఠీఛార్జి

- Advertisement -
- Advertisement -

400 ఎకరాల యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించారు. ప్రొఫెసర్లతో కలిసి ధర్నా చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈస్ట్ క్యాంపస్ వైపు వెళ్లే విద్యార్థులపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ ఆడిటోరియం నుండి ఈస్ట్ క్యాంపస్ మీదుగా ర్యాలీగా వెలుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. భారీ బందోబస్తుతో యూనివర్సిటీ ప్రధాన గేట్ ముందు వందల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించగా,

యూనివర్సిటీ లోపాల కూడా అదే తరహలో పోలీసు బలగాలను మోహరించి విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు దిగారు.విద్యార్థులు బయటకు వెళ్లకుండా, బయట నుండి వచ్చే విద్యార్థులను సైతం లోపాలకి రానివ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా మమ్మల్ని గుర్తించకుండా నేరస్థులుగా, టెర్రరిస్టులుగా పోలీసులు భావిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పోలీసులను, బుల్డోజర్లను వెనక్కి తీసుకోవాలని, క్యాంపస్ భూములను యూనివర్సిటీ పేరిపై రిజిష్ర్టేషన్ చేయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News