Monday, December 23, 2024

యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్‌ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, సునయన, రమణ, యువన్ శంకర్ రాజా, చంద్రబోస్, రాజేష్ ఎ మూర్తి, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఈ వేడుకలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “సినిమా కథకు ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా షూటింగ్ చేయాలనే జబ్బు విశాల్‌కు ఉంది. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది. మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను” అని అన్నారు. హీరో విశాల్ మాట్లాడుతూ “దర్శకుడు ఏ.వినోద్ కుమార్ గురించి సినిమా విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్‌నే చెబుతుంది. చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. యువన్ శంకర్ రాజా నాకు చాలా బ్లాక్‌బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చారు. ‘లాఠీ’కి బ్రిలియంట్ స్కోర్ చేశారు. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాని కూడా ఎంత మంది చూస్తారో ఒక్కొక్క టికెట్‌కి ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను”అని తెలిపారు. దర్శకుడు ఏ.వినోద్ కుమార్ మాట్లాడుతూ “లాఠీ… యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఒక సాధారణ కానిస్టేబుల్, అతని సాహసాలకు సంబంధించిన కథ. విశాల్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. యాక్షన్ సన్నివేశాల సమాహారం ఈ చిత్రం”అని చెప్పారు.

‘Lathi’ Movie Pre Release event in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News