Wednesday, January 22, 2025

’లాఠీ’… ‘పందెంకోడి’లా గ్యారెంటీ హిట్

- Advertisement -
- Advertisement -

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈనెల 22న ’లాఠీ’ అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతి ఎస్డీహెచ్‌ఆర్ జూనియర్ కాలేజ్‌లో గ్రాండ్‌గా జరిగింది. అగ్ర హీరో మంచు మోహన్ బాబు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.. “విశాల్ చేసిన సినిమాలన్నీ బావుంటాయి. అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ’లాఠీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తాను.

అందులో కానిస్టేబుల్ నుండి వచ్చిన వారంటే మరింత గౌరవం. ఇలాంటి ఒక గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశాల్. భగవంతుని ఆశీస్సులతో ’లాఠీ’… ‘పందెంకోడి’లా గ్యారెంటీ హిట్‌”అని అన్నారు. హీరో విశాల్ మాట్లాడుతూ “కానిస్టేబుల్‌కి ఒక లైఫ్‌స్టైల్ లేదు. సమాజం మేలు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు. నేను రీల్ లైఫ్ హీరో. వాళ్ళు రియల్ లైఫ్ హీరోలు. వాళ్ళే స్ఫూర్తి. ఖాకీ యూనిఫామ్ వేసుకొని నటించేటప్పుడు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. కానిస్టేబుల్‌కి గన్ వుండదు. ఒకే ఒక లాఠీ పట్టుకొని రంగంలో దిగుతారు. నేరస్తులని పట్టుకుంటారు. అందుకే ఈ సినిమా చేశాను. ఇందులో యాక్షన్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. పీటర్ హెయిన్స్ మాస్టర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేశారు”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీటర్ హెయిన్స్ మాస్టర్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News