Monday, December 23, 2024

ఫ్రెంచ్ గయానా నుంచి విజయవంతంగా జీశాట్‌-24 ఉపగ్రహ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

 

G-Sat24

కౌరు (ఫ్రెంచ్) : దేశీయ డిటిహెచ్ అవసరాల కోసం ‘ఇస్రో’ ప్రత్యేకంగా రూపొందించిన జీశాట్‌-24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ కంపెనీ ‘ఏరియన్‌స్పేస్  కౌరులోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్-24ని నింగిలోకి పంపింది. ఏరియన్-5 రాకెట్ ద్వారా శాటిలైట్‌ను భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టింది. తమ వాహకనౌక ద్వారా రెండవ ప్యాసింజర్ అయిన జీశాట్-24 విజయంతంగా వేరు చేయబడిందని, ఈ మేరకు సిగ్నల్స్ కూడా అందాయని ఏరియన్‌స్పేస్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. తమపై నమ్మకం ఉంచిన ఎన్‌ఎస్ఐఎల్-ఇండియాకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌కు చెందిన  ఎంఈఏఎస్‌ఏటీ-3డీ, ఒక మల్టీ-మిషన్ కమ్యూనికేషన్స్ శాటిలైట్‌ను కూడా ప్రయోగించినట్టు పేర్కొంది. ఫ్రెంచ్ కాలమానం ప్రకారం జూన్ 22న సాయంత్రం 6:50 గంటల సమయంలో ప్రయోగించారు. గయానా స్పేస్ సెంటర్‌ నుంచి ఇది 113వ ప్రయోగం.

జీశాట్-24 ప్రత్యేకతలు… ఉపయోగాలు

జీశాట్-24 అనేది ఒక కమ్యూనికేషన్స్ శాటిలైట్. ఉపగ్రహం బరువు 4180 కేజీలు. దీని ద్వారా దేశవ్యాప్తంగా డిటిహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చవచ్చు. ఏసియా-పసిఫిక్ ప్రాంతంలో బ్రాడ్ బ్యాండ్ కవరేజీని విస్తృత పరచవచ్చు. హై-క్వాలిటీతో టెలివిజన్, టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌బ్యాండింగ్ సర్వీసులు అందించవచ్చు. భారతీయ డిటిహెచ్ కస్టమర్ల అవసరాలను దీనిద్వారా తీర్చవచ్చు. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్‌ఎస్ఐఎల్ కోసం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. డిమాండ్-డ్రైవ్ తరహాలో ఇస్రో సిద్ధం చేసిన తొలి ఉపగ్రహం ఇదే.  జీశాట్-24 శాటిలైట్‌కి అవసరమైన నిధులను ఎన్‌ఎస్‌ఐఎల్ సమకూర్చింది. దీంతో ఈ ఉపగ్రహాన్ని ఎన్‌ఎస్‌ఐఎల్ ఆపరేటింగ్‌ చేయనుంది. కాగా శాటిలైట్ టివి కంపెనీ ‘టాటా ప్లే’ని  ఎన్‌ఎస్ఐఎల్ లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే.

ఒకే స్పెక్ట్రంతో ఎక్కువ డిటిహెచ్ ఛానల్స్…

ఎన్ఎస్ఐఎల్ తెలిపిన వివరాల ప్రకారం.. జీశాట్-24 కార్యకలాపలు మొదలైతే ఒకే స్పెక్ట్రంలో మరిన్ని డిటిహెచ్ ఛానల్స్‌ను వినియోగదారులకు అందించవచ్చు. అడిషనల్ రెయిన్ ఫేడ్ మార్జిన్‌తో హెచ్‌డి చానల్స్ వ్యవస్థను మరింత బలోపేతమవుతుందని వివరించింది. ఉపగ్రహ – ఆధారిత ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ సర్వీసుల ద్వారా క్లాస్ రూం కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని వెల్లడించింది. ఈ శాటిలైట్‌లో టెలికమ్యూనికేషన్స్, పురోగతి సాధిస్తున్న డిజిటల్ సినిమా, హైస్పీడ్ లింక్స్, బల్క్ డేటా ట్రాన్స్ఫర్‌కు సంబంధించిన అప్లికేషన్లు కూడా మెరుగుపడాయని వివరించింది.

“న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL)-  డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (DoS) ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ సంస్థ GSAT-24 ఉపగ్రహ మిషన్‌ను తన 1వ డిమాండ్ ఆధారిత మిషన్ పోస్ట్ స్పేస్ రిఫార్మ్‌గా చేపట్టింది” అని బెంగళూరులోని అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయమైన తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News