బిజెపి స్సెషల్ మైక్రో డొనేషన్ క్యాంపైన్ ప్రారంభం
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పాయ్ జన్మదినోత్సవం సందర్భగా శనివారం బిజెపి ‘స్పెషల్ మైక్రో డొనేషన్ క్యాంపైన్ ’ ను ప్రారంభించింది. పార్టీ కార్యకర్తలు, సభ్యులతోపాటు ఇతరుల నుంచి చిన్నపాటి విరాళాలు సేకరించి పార్టీకి మరింత ఆర్థిక పుష్టిని కలిగించడమే దీని లక్ష్యం. దీనికి ప్రధాని మోడీ రూ. 1000 విరాళం అందించారు. దేశానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ లక్షమని, తమ పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా జీవితాతం పార్టీకి సేవ చేసేందుకు, పార్టీ బలోపేతానికి ఈ చిన్నపాట విరాళాలు ఎంతో దోహదం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. బిజెపిని బలోపేతం చేయడానికి, తద్వారా దేశం బలోపేతం కాడానికి సహాయం చేయాలని ఆయన దాతలను కోరారు. దాతలు రూ.5,రూ.50,రూ.100, రూ.500, రూ.1000 వంతున ఎంతైనా తమకు తోచిన రీతిలో విరాళాలు అందించవచ్చని చెప్పారు. ఈ విరాళాల ప్రచార ఉద్యమం ద్వారా తమ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది ప్రజలకు చేరువ కాగలరని పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. ఫిబ్రవరి 11 పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ వర్ధంతి రోజు వరకు ఈ విరాళాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.