- Advertisement -
న్యూఢిల్లీ : బిగాస్ ఆటో ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్(ఇవి) స్కూటర్ బిఐ సి12ను విడుదల చేసింది. డి15, బి8, ఎ2ల విజయాన్ని సి12 అనుసరిస్తుంది. ప్రీమియం స్కూటర్ అయినప్పటికీ అత్యంత అందుబాటు ధరలో లభ్యం కానుంది. విద్యుత్ స్కూటర్ సి12 సుమారు 20కు పైగా భద్రతా ఫీచర్లతో వస్తోంది. కంపెనీ ఫౌండర్, ఎండి హేమంత్ కాబ్రా మాట్లాడుతూ, ఫేమ్ సర్టిఫైడ్ వాహనం సి12ఐ మ్యాక్స్, అత్యంత సౌకర్యవంతమైన సీట్‌తో పాటుగా ఎఆర్‌ఎఐ సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని అన్నారు. రూ.999తో బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ వెబ్‌సైట్, డీలర్‌షిప్ వద్ద బుక్ చేసుకోవచ్చు. బిజి సి12 ధర రూ.97,999గా ఉంది.
- Advertisement -