Monday, December 23, 2024

ఐఎన్‌ఎస్ వాగ్షీర్ సబ్‌మెరైన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Launch of INS Wagshir submarine

 

ముంబై : p75 స్కార్పీన్ ప్రాజెక్టు లోని ఆరు జలాంతర్గాముల్లో చివరిదైన ఐఎన్‌ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిని ది మెజగాన్ షిప్ బిల్డర్సు బుధవారం ప్రారంభించారు. రక్షణ కార్యదర్శి అజయ్‌కుమార్ దీన్ని ప్రారంభించారు. ఇది పూర్తిగా పోరాట యోగ్యమైనదన్న నమ్మకం కుదిరేవరకు ఏడాది కాలం వరకు అనేక పరీక్షలు, విన్యాసాలు చేయించడమౌతుందని, కుమార్ తెలిపారు. అనుకున్న గడువుకు ముందే దీన్ని ప్రారంభించడమైందని చెప్పారు. స్వయం సామర్ధానికి ఇదొక ఉదాహరణని, దేశ సాగరభద్రత మరింత పటిష్టమౌతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు లోని ప్రతి సబ్‌మెరైన్ తయారీ స్వదేశీకరణ భాగం పెంచడమైందని, ఈ వాగ్షీర్ సబ్‌మెరైన్‌లో 40 శాతం వరకు స్వదేశీ పరిజ్ఞానం వినియోగించడమైందని మెజగాన్ షిప్ బిల్డర్స్ అధికారి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News