Friday, December 20, 2024

లాక్టేషన్ మేనేజ్‌మెంట్ కేంద్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన గొప్ప పథకం న్యూట్రిషన్ కిట్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం కాంప్రెన్సివ్ లాక్టాషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను, న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, నగర మేయర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ తెలంగాణలో పుట్టబోయే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అమ్మ కాబోతున్న ప్రతి మహిళ రక్తహీనతను అరికట్టడానికి హార్లి క్స్, ఐరన్, సిరప్, ఖర్జూరం, నెయ్యి, పల్లి చిక్కి వంటి బలవర్దకమైన పోషకాహారాలతో పాటు హర్లిక్స్ తాగడానికి కప్పు, వస్తువులను అమర్చుకోవడానికి బాస్కెట్ మొత్తం 3 వేల విలువ గల న్యూట్రిషన్ కిట్‌లను రెండవ, మూడవ చెకప్‌లు చేయించుకున్న తరువాత అం దించుకోవడం జరుగుతుందని, ఎక్కడైన పుట్టిన బిడ్డల గురించి పథకాలను ఆయా రాష్ట్రాలు ప్రవేశపెడితే, భారతదేశంలోనే మొట్టమొదటి పథకం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకమని మంత్రి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో 20 మంది గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్‌లను అందించడంతో పాటు కేసీఆర్ కిట్‌వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, నగర మేయర్ వై సు నీల్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, జిల్లా వైద్యాధికారి కె లలితాదేవి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూప రింటెండెంట్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్, ఆర్‌ఎంవో డాక్టర్ జ్యోతి, డాక్టర్ ఆలీ, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News