Wednesday, January 22, 2025

‘ప్రగతికి ప్రతినిధి..మన కేటీఆర్‌’ పాట ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభసందర్భంగా ఎన్నారై బీఆర్‌ఎస్ సెల్ – లండన్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి ‘ప్రగతికి ప్రతినిధి మన కేటీఆర్‌” అనే పాటను రవీంద్రభారతిలో ఆదివారం నాడు ఆవిష్కరించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ,ఎన్నారై బీఆర్‌ఎస్ కో-ఆర్డినేటర్ బిగాల మహేష్ గుప్తా , తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ , ఎన్నారై బీఆర్‌ఎస్ సెల్ – లండన్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర చిత్ర , టీవీ, థియేటర్స్ డెవల్ప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచ్లం , రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి , తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ , బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ , ముషీరాబాద్ యువ నాయకులు ముఠా జైసింహ , భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News