Wednesday, January 22, 2025

లావా నుంచి బ్లేజ్ ప్రో 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన లావా తాజాగా స్మార్ట్‌ఫోన్ ది లావా బ్లేజ్ ప్రో 5జిని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.12,499కు అందిస్తున్నట్లుగా సంస్థ ప్రకటించింది. మీడియా టెక్ డైమెన్సిటి 6020 సూపర్-ఫాస్ట్ ప్రాసెసర్ ఉన్న ఈ బ్లేజ్ ప్రో 5జి ఆండ్రాయిడ్ 13 బ్లోట్‌వేర్ రహితమైన ఒఎస్ ఆధారితమైంది. 128 జిబి స్టోరేజ్, 16 జిబి వరకు పొడిగించదగిన 8 జిబి ర్యామ్ కలిగి ఉంది. ఇది సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ ఎంటికే డి6020 ఆధారితం, ఇందులో ఇఐఎస్ సపోర్ట్ తో 50ఎంపి రియర్ కెమెరా, టైప్ సి పోర్ట్‌తో 5000 ఎంఎహెచ్, 33 డబ్లు వేగంగా చార్జ్ అయ్యే బ్యాటరీ ఉన్నాయి. లావా ఉచిత హోమ్ సర్వీస్ తో లావా క్లీన్, బ్లోట్‌వేర్ రహితమైన ఆండ్రాయిడ్ 13 అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News